Assam: అసోం ఎన్నికల బరిలో 264 మంది కోటీశ్వరులు

264 Crorepati contesting in Assam Assembly election

  • కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా 64 మంది
  • బీజేపీ నుంచి 60 మంది
  • రూ.5 కోట్లకు పైగా ఆస్తులున్నవారు 72 మంది
  • యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి మనోరంజన్ బ్రహ్మకు రూ.268 కోట్ల ఆస్తులు

అసోం శాసనసభ ఎన్నికల్లో 264 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న 946 మంది అభ్యర్థుల్లో 27.90 శాతం మంది ధనికులు కావడం గమనార్హం. యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి మనోరంజన్ బ్రహ్మ రూ.268 కోట్ల ఆస్తులతో ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత ధనవంతుడిగా నిలిచారు.  

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున అత్యధికంగా 64 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి 60 మంది, అసోం జాతీయ పరిషత్తు నుంచి 31 మంది, అసోం గణ పరిషత్తు నుంచి 22 మంది, ఏఐయూడీఎఫ్‌ నుంచి 11 మంది, బీపీఎల్‌ పార్టీ నుంచి 8 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. రూ.5 కోట్లకు పైగా ఆస్తులున్న అభ్యర్థులు 72 మంది ఉండగా.. రూ.2-5 కోట్ల మధ్య ఉన్నవారు 91 మంది ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ. రెండు కోట్ల మధ్య మరో 197 మంది ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News