India: మరోమారు తగ్గిన పెట్రోలు ధరలు!

Petro Price Slashed in Tuesday

  • లీటరు పెట్రోలుపై 22 పైసల తగ్గింపు
  • డీజిల్ పై 23 పైసలు తగ్గిన ధర
  • ప్రకటించిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు

దాదాపు నాలుగు రోజుల తరువాత మరోమారు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలుపై 22 పైసలు, డీజిల్ పై 23 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి.

మారిన ధరల తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 90.56కు తగ్గగా, డీజిల్ ధర లీటరుకు రూ. 80.87కు చేరింది. ఇదే సమయంలో హైదరాబాదులో పెట్రోలు ధర లీటరుకు రూ. 94.16, డీజిల్‌ రూ. 88.20కు చేరగా, అమరావతిలో పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్‌ ధర రూ. 90.28కు తగ్గింది.

ఇక మిగతా మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 87.96కు చేరుకుంది. కోల్‌ కతాలో పెట్రోల్‌ రూ.  90.77గా, డీజిల్ ధర  రూ 83.75గా ఉంది. ఇక చెన్నై విషయానికి వస్తే, పెట్రోల్ ధర రూ. 92.58కు, డీజిల్ ధర రూ. 85.88 22కు తగ్గింది.

  • Loading...

More Telugu News