: 2014లో తెలంగాణ వస్తుంది: కేంద్రమంత్రి బలరాం నాయక్
తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో కచ్చితంగా ప్రకటిస్తారని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. ఈ విషయంలో సోనియాపై తనకు పూర్తి నమ్మకముందని తెలిపారు. అంతవరకూ కాంగ్రెస్ నేతలు ఓపిగ్గా ఎదురుచూడాలన్నారు. కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ లో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు... తాను కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నట్టు చెప్పారు. త్వరలోనే ఆ ఎంపీలతో కలిసి దానిపై మాట్లాడతానన్నారు. అధిష్ఠానానికి డెడ్ లైన్లు పెట్టడం సరికాదని అన్నారు. సరైన సమయంలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు.