Rashmika Mandanna: ముంబై స్టార్ హోటల్ లో రష్మిక, విజయ్ డిన్నర్ డేట్!

Rashmika and Vijay on Dinner Date in Mumbai

  • షూటింగ్ కోసం ముంబైలో ఉన్న స్టార్లు 
  • ప్రేమలో ఉన్నారని వార్తలు 
  • వైట్ ఫ్లవర్స్ చేతిలో పట్టుకుని కనిపించిన రష్మిక

బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మందన్న 'మిషన్ మజ్ను' చిత్రం కోసం, హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రం కోసం ఒకే సమయంలో ముంబైలో ఉన్న వేళ, ఓ స్టార్ హోటల్ లో డిన్నర్ డేట్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ  వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' సినిమా సూపర్ హిట్ తరువాత 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటించిన ఈ జంట హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకుంది.

తాజాగా, ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ ముందు కనిపించారు. ఆ సమయంలో రష్మిక చేతిలో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. వాటితోనే ఫొటోలకు ఇద్దరూ పోజులిచ్చారు. ఇక వాటిని విజయ్ స్వయంగా తెచ్చిచ్చాడా? అన్న విషయమై స్పష్టత లేకున్నా, చాలా రోజుల తరువాత ఇద్దరూ బయట కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రం ఆనందిస్తున్నారు.

Rashmika Mandanna
Vijay Devarakonda
Dinner Date
  • Loading...

More Telugu News