Prabhas: 'సలార్' కాంబినేషన్లో మరో సినిమా.. ప్రముఖ నిర్మాత ప్లానింగ్?

One more film planned in Salar combination

  • ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో 'సలార్'
  • ఇదే కలయికలో దిల్ రాజు సినిమా
  • ప్రస్తుతం చర్చల దశలో ప్రాజక్టు  

ఇటీవల 'రాధే శ్యామ్' చిత్రాన్ని పూర్తి చేసిన హీరో ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్'. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో కొనసాగుతోంది. మరొక సినిమా 'సలార్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల జరిగింది.

ఇదిలావుంచితే, 'సలార్' చిత్రం ఇంకా నిర్మాణ దశలో ఉండగానే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ ఈ కాంబోని సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ ప్రాజక్టు చర్చల దశలో వుందని అంటున్నారు.

అయితే, ఇప్పుడు ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన తన ప్రాజక్టులతోను, ప్రశాంత్ తన ప్రాజక్టులతోను ఎవరికి వారు బిజీగా వున్నారు. ఇప్పుడు దిల్ రాజు ప్రాజక్టు పట్టాలెక్కాలంటే మరికొంత సమయం పడుతుందన్న మాట!

Prabhas
Prashanth Neil
Dil Raju
Salar
  • Loading...

More Telugu News