Corona Virus: తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

 Media Bulletin on status of positive cases COVID19 in Telangana

  • కొత్త‌గా 431 కరోనా కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య 3,04,298
  • మృతుల సంఖ్య  1,676
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 111 మందికి క‌రోనా  

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 228  మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,298 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,270 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1676గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,352 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,395 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 111 మందికి క‌రోనా సోకింది.
 
 

  • Loading...

More Telugu News