Suvendu Adhikari: బీజేపీలోకి తృణమూల్​ ఎంపీ, సువేందు అధికారి తండ్రి

TMC MP Sisir Adhikari Suvendus father Joins BJP
  • అమిత్ షా సమక్షంలో చేరిన శిశిర్ అధికారి
  • జై శ్రీరామ్.. జై భారత్ అంటూ నినాదాలు
  • అరాచకవాదుల నుంచి బెంగాల్ ను రక్షించాలని పిలుపు
సువేందు అధికారి తండ్రి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారి కూడా బీజేపీలో చేరారు. ఆదివారం ఆయన అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా ఈగ్రాలో నిర్వహించిన అమిత్ షా సభకు హాజరైన ఆయన.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. బెంగాల్ ను అరాచకవాదుల చేతుల్లో నుంచి కాపాడాలని జనానికి పిలుపునిచ్చారు.

‘‘అరాచకాలవాదుల చెర నుంచి బెంగాల్ ను రక్షించండి. మేమంతా మీ వెంటే ఉన్నాం. పార్టీ మీకు అండగా ఉంది. జై శ్రీరామ్.. జై భారత్’’ అని వ్యాఖ్యానించారు. మిడ్నాపూర్ గౌరవం కోసం పోరాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తమకు పార్టీని వీడాలన్న ఉద్దేశమే లేదని, కానీ, పార్టీ నేతలే తమను బయటకు గెంటేశారని ఆయన ఆరోపించారు.

నందిగ్రామ్ లో మమతను సువేందు ఓడించి తీరుతాడన్నారు. భారీ ఆధిక్యంతో సువేందు గెలుస్తాడని చెప్పారు. తాను కూడా నందిగ్రామ్ లో ప్రచారం చేస్తానన్నారు. తాను పార్టీ వీడతానని తెలిసినా ఎవరూ తన దగ్గరికి రాలేదని, పైగా తనపై ‘గద్దర్’, ‘మిర్ జాఫర్’ అన్న ముద్ర వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Suvendu Adhikari
BJP
Shishir Adhikari
Trinamool
West Bengal
Mamata Banerjee
TMC

More Telugu News