Centre: 20 రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలు పూర్తి చేశాయి: కేంద్రం వెల్లడి

Centre said twenty states completed ease of doing reforms implementation

  • దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలు
  • పూర్తి చేసిన రాష్ట్రాలకు అదనపు రుణాలు
  • తాజాగా ఈ జాబితాలో 5 రాష్ట్రాలు
  • రూ.39,521 కోట్ల రుణాలు పొందే అవకాశం

కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట రాష్ట్రాలకు ప్రమాణాలు నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలును పూర్తి చేసిన రాష్ట్రాలకు కేంద్రం అదనపు రుణాలు పొందే సదుపాయం కల్పిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదిక వెల్లడించింది.

ఇప్పటివరకు దేశంలో 20 రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలును పూర్తి చేశాయని వివరించింది. ఈ రాష్ట్రాలు బహిరంగ విపణి ద్వారా రూ.39,521 కోట్ల అదనపు రుణాలు స్వీకరించేందుకు అనుమతి దక్కించుకున్నాయని పేర్కొంది. ఈ అదనపు రుణాల శాతం రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో 0.25 శాతం అని వివరించింది. ఈ రాష్ట్రాల జాబితాలోకి తాజాగా అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, గోవా, మేఘాలయ, త్రిపుర కూడా చేరాయని వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాలు ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల అమలును పూర్తి చేశాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News