Ganta Srinivasa Rao: కేటీఆర్ ను కలిసిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు

Ganta Srinivas Rao meets KTR

  • అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ ను కలిసిన గంటా
  • స్టీల్ ప్లాంటు ఉద్యమానికి ఇప్పటికే కేటీఆర్ మద్దతు 
  • విశాఖకు రావాలని ఆహ్వానించిన గంటా 

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వైజాగ్ కు రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ ను గంటా కోరారు.

గంటా కోరికపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే విశాఖ పర్యటనపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తాను మద్దతు ప్రకటిస్తున్నానని... రేపు తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి జోలికి కేంద్రం వస్తే ఏపీ తమకు మద్దతు తెలపాలని ఆయన అన్నారు.

Ganta Srinivasa Rao
Telugudesam
KTR
TRS
  • Loading...

More Telugu News