Ongole: ఒంగోలులో రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

Love Couple Committed Suicide in Ongole

  • పెళ్లూరు వద్ద ఘటన
  • ఇద్దరూ పాలిటెక్నిక్ విద్యార్థులే
  • ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా

ఒంగోలులో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారులోని పెళ్లూరు వద్ద నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. యువకుడిని చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి  చెందిన మద్ది వెంకటసాయి కృష్ణగా గుర్తించగా, యువతిది చీమకుర్తిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News