Jagan: తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan preview meeting on Tirupati By Polls
  • ఏప్రిల్ 17న తిరుపతి బై పోల్స్
  • అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
  • గెలుపు వ్యూహంపై నేతలతో సీఎం చర్చ
  • భారీ మెజారిటీతో గెలిచేలా ప్లాన్ చేయాలన్న సీఎం
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి బరిలో విజయం సాధించడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై చర్చించారు. విభేదాలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో తిరుగులేని విజయం సాధించాలని స్పష్టం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల బరిలో వైసీపీ తరఫున సీఎం జగన్ వ్యక్తిగత వైద్యుడు గురుమూర్తి పోటీచేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పోటీకి నిలపగా... బీజేపీ-జనసేన అభ్యర్థిపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ చింతా మోహన్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.
Jagan
Tirupati LS Bypolls
Dr Gurumurthy
YSRCP
Andhra Pradesh

More Telugu News