Sameera Reddy: అప్పట్లో ఇలా ఉండేదాన్నంటూ టీనేజి ఫొటో పంచుకున్న సమీరా రెడ్డి

Actress Sameera Reddy shares her teenage pic
  • సోషల్ మీడియా వచ్చాక సినీ తారలను వేధిస్తున్న బాడీ షేమింగ్
  • పెళ్లయ్యాక మారిపోతున్న రూపురేఖలు
  • విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
  • టీనేజీలోనే ఈ సమస్య ఎదుర్కొన్నానంటున్న సమీరా
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను విమర్శనాత్మక దృష్టితో చూడడం ఎక్కువైపోయింది. పలువురు తారలు సినిమాల నుంచి తప్పుకున్నాక బాడీ షేమింగ్ (శరీర ఆకృతిని గేలి చేయడం)కు గురవుతున్నారు.  పెళ్లి చేసుకుని తల్లి అయ్యాక ఒకప్పటి అందాల హీరోయిన్లు కాస్తా రూపురేఖలు మారిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా తయారవుతుంటారు. ఈ బాడీ షేమింగ్ గురించి నటి సమీరారెడ్డి తన అభిప్రాయాలను పంచుకుంది.

తాను టీనేజీలోనే బాడీ షేమింగ్ సమస్యను ఎదుర్కొన్నానని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. అప్పట్లో సినిమాల్లోకి రాకముందు తాను ఎలా ఉన్నానో చూడండి అంటూ ఓ ఫొటోను పంచుకుంది. అందులో సమీరా చాలా బొద్దుగా ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఫొటోపై ఆమె వ్యాఖ్యానిస్తూ... టీనేజీలో తన శరీరాకృతి పట్ల చాలామంది రకరకాల వ్యాఖ్యలు చేసేవాళ్లని, అలాంటి ప్రతికూల వ్యాఖ్యలతో ఎంతో బాధ కలిగేదని వెల్లడించింది.

అందుకే, తన పిల్లలకు ఇప్పటినుంచే ఇలాంటి పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తున్నానని తన పోస్టులో వివరించింది. ఎదుటివాళ్లు ఎలా ఉన్నా, అందరినీ సమదృష్టితో చూడాలని చెబుతున్నానని పేర్కొంది. సమాజంలో ఎదురయ్యే సమస్యల పట్ల సహనం వహించాలని సూచిస్తున్నానని తెలిపింది.
Sameera Reddy
Pic
Teenage
Body Shaming
Tollywood
Bollywood

More Telugu News