Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

Media Bulletin on status of positive cases COVID19 in Telangana

  • కొత్త‌గా 228 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,161
  • మృతుల సంఖ్య 1,653
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 46 మందికి క‌రోనా

తెలంగాణలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగిపోతున్నాయి. కొత్త‌గా 228 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 152 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,515 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,653గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,993 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 795 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 46 మందికి క‌రోనా సోకింది.
 

  • Loading...

More Telugu News