Tamanna: వెండితెరకు మరో ప్రముఖ నటి జీవితకథ?

Jamuna biopic on cards

  • సినీ ప్రముఖుల బయోపిక్స్ కు ఆదరణ
  • 'డర్టీ పిక్చర్', 'మహానటి' బాక్సాఫీస్ హిట్స్
  • వెండితెరకు ప్రముఖ నటి జమున జీవితకథ
  • టైటిల్ పాత్రను పోషించనున్న తమన్నా?     

ఇటీవలి కాలంలో బయోపిక్స్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మలుపులతో కూడిన సినీ సెలబ్రిటీల నిజజీవిత కథలను ఆసక్తికరంగా వెండితెరకు ఎక్కిస్తే కనుక అవి భారీ విజయాలను పొందుతున్నాయి. గతంలో సిల్క్ స్మిత జీవితకథతో వచ్చిన 'డర్టీ పిక్చర్'.. ఇటీవల వచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాలను అందుకున్నాయి.

ఈ క్రమంలో మరో ప్రముఖ టాలీవుడ్ నటి కథను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొన్నటి తరం ప్రముఖ కథానాయకులందరి సరసన నటించి, నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రముఖ నటి జమున బయోపిక్ ను నిర్మించడానికి ఇప్పుడు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా 'దేవినేని' సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు శివనాగు నర్రా దీనికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు రూపకల్పనలో ఆయన జమునను, ఆమెతో సాన్నిహిత్యం వున్న పలువురిని కలిసి సమాచారం సేకరిస్తున్నాడట. ఇక జమున పాత్రలో నటింపజేయడానికి తమన్నాను ఆయన సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.  

Tamanna
Jamuna
Savitri
Shivanagu
  • Loading...

More Telugu News