Subramanian Swamy: చంద్రబాబుకు ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అవుతుంది: సుబ్రహ్మణ్యస్వామి

It would be bad news for Chandrababu says Subramanian Swamy

  • తిరుమల ఆలయంపై అసత్య ప్రచారం జరుగుతోంది
  • తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థపై పరువునష్టం దావా వేస్తా
  • టీటీడీపై ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా చేస్తా

తిరుమల ఆలయంపై గత కొంత కాలంగా అసత్య ప్రచారం జరుగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిందని... ఆ సంస్థపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల ఆలయంపై దుష్ప్రచారం ఎక్కువైందని అన్నారు.

టీడీపీ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. గత ఐదేళ్లకు సంబంధించిన టీటీడీ అకౌంట్లను కాగ్ తో ఆడిట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అవుతుందని చెప్పారు. టీటీడీపై ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా చేస్తానని అన్నారు.

తమిళనాడులోని నటరాజస్వామి ఆలయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం లేకుండా తాను చేశానని స్వామి చెప్పారు. ఆలయ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తనకు, తమిళనాడు రాష్ట్రానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని అన్నారు. మసీదులు, చర్చిలపై ప్రభుత్వాల అజమాయిషీ లేదని... ఇదే సమయంలో ప్రభుత్వాల అధీనంలో 4 లక్షల ఆలయాలు ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News