Dethadi Harika: బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికకు షాక్!

Dethadi Harika removed as Brand Ambassador

  • తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక నియామకం 
  • సీఎంవో, టూరిజం మంత్రికి సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం
  • శాఖాపరమైన అనుమతులు తీసుకోకపోవడంతో తొలగించిన వైనం

బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె నిన్న నియామకపత్రాన్ని అందుకున్నారు.

అయితే టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కానీ, సీఎం కార్యాలయానికి గానీ సమాచారమివ్వకుండానే ఆయన నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో, ఆయనను సీఎంవో అధికారులు మందలించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె వివరాలను టూరిజం శాఖ తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. శాఖాపరమైన అనుమతులు తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడం... హారిక పట్ల శాపంగా పరిణమించింది.

Dethadi Harika
Bigg Boss
Brand Ambassador
  • Loading...

More Telugu News