Meghan Markle: ప్రిన్స్ హ్యారీని పెళ్లాడి ఇబ్బందులు పడ్డానన్న మేఘన్.. జాత్యహంకారానికి తావు లేదన్న బ్రిటన్!

Britain responds about Meghan Markle Comment

  • రాజకుటుంబం నుంచి దూరమైన హ్యారీ-మేఘన్ దంపతులు
  • ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన మర్కెల్
  • పుట్టబోయే బిడ్డ శరీర రంగు గురించి చర్చ జరిగిందని ఆవేదన

ప్రిన్స్ హ్యారీని పెళ్లాడి తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, బ్రిటన్ రాజ కుటుంబంలోకి  అడుగుపెట్టాక పలు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ మేఘన్ మర్కెల్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటన్ స్పందించింది. ఇటీవల రాజ కుటుంబం నుంచి దూరం జరిగిన హ్యారీ, మేఘన్ దంపతులు తాజాగా అమెరికాలో ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా మేఘన్ మాట్లాడుతూ హ్యారీని పెళ్లాడాక రాజ కుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. తాను గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ శరీర రంగు గురించి ఎడతెగని చర్చ జరిగిందని పేర్కొన్నారు. బిడ్డ నల్లగా పుడుతుందేమోనన్న ఆందోళన రాజ కుటుంబంలో వ్యక్తమైందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఇంటర్వ్యూపై స్పందించిన బ్రిటన్ మంత్రి విక్కీ ఫోర్డ్ తమ దేశంలో జాత్యహంకారానికి తావు లేదని స్పష్టం చేశారు.

Meghan Markle
Prince Harry
Britain
  • Loading...

More Telugu News