Balakrishna: హిందూపురంలో ఓ యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ

Balakrishna furious over an young man in Hindupur

  • హిందూపురంలో బాలకృష్ణ పర్యటన
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైనం
  • 9వ వార్డు అభ్యర్థితో మాట్లాడుతుండగా వీడియో తీసిన యువకుడు
  • వీడియో ఆపేయాలన్న బాలయ్య
  • వినకుండా వీడియో తీసిన యువకుడు

నందమూరి బాలకృష్ణ ఆవేశం గురించి తెలిసిందే. ఆయన తనకు నచ్చని విషయాలపై తీవ్రంగా స్పందిస్తుంటారు. ఆ కోపంలో చెంపచెళ్లుమనిపించడం బాలయ్యకు అలవాటే! దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన హిందూపురంలో ఓ యువకుడిపై ఇలాగే చేయి చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ హిందూపురం 9వ వార్డు అభ్యర్థితో మాట్లాడుతుండగా, ఓ యువకుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దాంతో బాలయ్య వీడియో రికార్డింగ్ ఆపేయాలని సూచించారు.

అయినప్పటికీ ఆ యువకుడు వీడియో తీయడం కొనసాగిస్తుండడంతో మండిపడిన బాలయ్య చెంపచెళ్లుమనిపించారు. దాంతో అక్కడున్న వాళ్లు స్పందించి... బాలయ్య స్టాప్ అన్నాడంటే ఆపేయాల్సిందే అని ఆ యువకుడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.

  • Loading...

More Telugu News