: బంగారం ధరల పతనాన్ని అడ్డుకున్న రూపాయి


బంగారం ధర మరింత పడకుండా రూపాయి అడ్డేసింది. అదెలా అనుకుంటున్నారా? రూపాయి విలువ తగ్గిపోతుంది కనుక బంగారం ధర పడిపోకుండా వారధిలా పనిచేస్తోంది. ఎందుకంటే బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం కనుక. వాస్తవానికి గత నెలలో బంగారం రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 10 గ్రాముల ధర 25 వేలను తాకింది. అప్పుడు అంతర్జాతీయంగా ట్రాయ్ ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 1362 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు దానికంటే కేవలం 30 డాలర్ల ఎగువన 1390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాస్తవానికి ఈ లెక్కన చూస్తే 24క్యారట్ల బంగారం 10 గ్రాములు 25,500 రూపాయలకు దిగి రావాలి. కానీ, ప్రస్తుతం దేశీయంగా 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.27,000 వద్ద ఉంది. క్షీణిస్తున్న రూపాయి విలువ దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర పడిపోకుండా ఆదుకుంటోంది. తక్కువ ధరల్లో బంగారం కొనాలని ఆశపడుతున్న వారికి ఇది నిరాశ కలిగించేదే.

  • Loading...

More Telugu News