Kalvakuntla Kavitha: త్వరలోనే హనుమాన్ నామ సంకీర్తన చేపడతాం: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha visits Kondagattu Hanuman Temple

  • కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎమ్మెల్సీ కవిత
  • ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
  • దేవాలయాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామన్న కవిత
  • ఆలయాలకు బడ్జెట్ కేటాయించింది తమ ప్రభుత్వమేనని వెల్లడి

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు విచ్చేశారు. ఇక్కడి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, దేశంలో ప్రసిద్ధిచెందిన దేవస్థానాల్లో కొండగట్టు ఒకటని వెల్లడించారు. ఇటీవల కాశీలో సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించామని, అక్కడ కూడా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం గురించి ప్రస్తావన వచ్చిందని వెల్లడించారు.

త్వరలోనే హనుమాన్ నామ సంకీర్తన చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. దేవాలయాల కోసం బడ్జెట్ కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే సొంతమని అన్నారు. కాగా, కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సమయంలో ఆమె వెంట రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News