CBI: కోల్ స్కాంలో మమతా మేనల్లుడి భార్యపై ప్రశ్నల వర్షం కురిపించిన సీబీఐ

CBI questions Rujira Banarjee in coal scam

  • బొగ్గు కుంభకోణంలో ఇటీవల రుజిరా బెనర్జీకి నోటీసులు
  • ఆమె నివాసంలో గంట పాటు ప్రశ్నించిన అధికారులు
  • సీబీఐ అధికారులు రాకముందు మేనల్లుడి ఇంటికి మమత
  • పది నిమిషాల పాటు అక్కడే గడిపిన వైనం

కోల్ స్కాంలో ఇటీవలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ అధికారులు నోటీసులు పంపడం తెలిసిందే. తాజాగా, రుజిరా బెనర్జీని ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు. కోల్ కతాలోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు గంట పాటు సీబీఐ అధికారులు రుజిరా బెనర్జీని ప్రశ్నించారు.

అంతకుముందు, సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడి నివాసానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అధికారులు రాకముందే మమత రావడం, పది నిమిషాల పాటు అక్కడే గడపడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కేంద్రంతో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ స్పర్ధలు తీవ్రరూపు దాల్చాయి. తమను రాజకీయంగా దెబ్బతీసేందుకే సీబీఐని ఉపయోగించుకుంటున్నారని మమత వర్గం విమర్శిస్తోంది.

  • Loading...

More Telugu News