Rahul Gandhi: కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీశ్‌ శర్మ పాడె మోసిన రాహుల్ గాంధీ

Congress leader Rahul Gandhi gives shoulder to the mortal remains of party leader Captain Satish Sharma

  • గాంధీ కుటుంబానికి విధేయుడు కెప్టెన్‌ సతీశ్‌ శర్మ
  • అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూత‌
  • ఢిల్లీలో నేడు అంత్య‌క్రియ‌లు
  • 1947, అక్టోబరు 11న సికింద్రాబాద్‌లో జన్మించిన సతీశ్‌ శర్మ ‌

కేంద్ర మాజీ మంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడు కెప్టెన్‌ సతీశ్‌ శర్మ (73) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న అంత్యక్రియలను ఢిల్లీలో జరుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పాడెను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌లు మోశారు.
 
కాగా, 1947, అక్టోబరు 11న సతీశ్‌ శర్మ సికింద్రాబాద్‌లో జన్మించారు. స‌తీశ్ శ‌ర్మ‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొద‌ట‌ ప్రొఫెషనల్‌ కమర్షియల్‌ పైలెట్ గా ప‌ని చేసిన ఆయ‌న అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు‌. మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయ‌న‌ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News