America: టెక్సాస్‌ను ముంచెత్తుతున్న భారీ మంచుతుపాను.. హూస్టన్‌లో 120 రోడ్డు ప్రమాదాలు

Snowfall fears Texas People

  • టెక్సాస్ ప్రజలను వేధిస్తున్న మంచు తుపాను
  • రహదారులపై భారీగా పేరుకుపోయిన మంచు
  • కరెంటు కోతలతో నరకం చూస్తున్న ప్రజలు
  • నేడు 30 సెంటీమీటర్ల మేర మంచు కురిసే అవకాశం

అమెరికాలోని టెక్సాస్‌ను మంచుతుపాను కమ్మేస్తోంది. భారీగా మంచు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు మైనస్ 5 డిగ్రీలకు పడిపోయాయి. రహదారిపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు, రోడ్డుపై మంచు కారణంగా వాహనాలు జారి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. హూస్టన్‌లో ఏకంగా 120 ప్రమాదాలు ఇలా జరిగాయి. ఒక ప్రమాదంలో పది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఉష్ణోగ్రతలు మైనస్‌లకు  పడిపోవడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో కరెంటు కోతలు కూడా పెరిగాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కోతలు మరికొన్నాళ్లు ఇలానే ఉంటాయని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. కాగా, నేడు అమెరికా దక్షిణ ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల మేర మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్‌లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. మంచు తుపాను కారణంగా విమాన ప్రయాణాలకూ అంతరాయం ఏర్పడుతోంది.

America
Texas
Snowfall
Houston
  • Loading...

More Telugu News