Arvind Kejriwal: కేజ్రీవాల్ కూతురుని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్ట్

3 arrested in cheating Arvind Kejriwal daughter

  • సోఫాను ఆన్ లైన్లో అమ్మేందుకు యత్నించిన హర్షిత
  • దానిని కొంటానని ముందుకొచ్చిన ఓ వ్యక్తి 
  • ముందుగా చిన్న మొత్తం ఆమె అకౌంటుకు బదిలీ 
  • బార్ కోడ్ స్కాన్ చేయమని కోరిన కేటుగాడు
  • ఆమె అకౌంట్ నుంచి రూ.34 వేలు కొట్టేసిన వైనం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. సెకండ్ హ్యాండ్ సోఫాను ఆన్ లైన్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెను వీరు రూ. 34 వేల మేరకు మోసం చేశారు. వీరిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు.

మోసం ఎలా చేశారనే వివరాల్లోకి వెళ్తే... సోఫాను అమ్ముతున్నట్టు ఆన్ లైన్లో హర్షిత పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో, తనను తాను కస్టమర్ గా పేర్కొన్న ఓ వ్యక్తి... చిన్న మొత్తాన్ని ఆమె అకౌంట్ కు బదిలీ చేస్తూ, బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత బార్ కోడ్ ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలను కొట్టేశారు. ఈ మోసంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News