Gujarath: వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిన గుజరాత్ సీఎం విజయ్ రూపాని... వీడియో ఇదిగో!

Gujarath CM Faints on Stage

  • నిజామ్ పురాలో జరిగిన సభ
  • ప్రసంగిస్తూ పడిపోయిన రూపానీ
  • అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలింపు

గుజరాత్ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న వేళ, సీఎం విజయ్ రూపానీ ఒక్కసారిగా కుప్పకూలారు. మాట్లాడుతూ ఒక్కసారిగా పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే అహ్మదాబాద్ కు తరలించి, ఆసుపత్రిలో చేర్చారు.

ఆయన గత రెండు రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్నారని, అయినప్పటికీ ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని వ్యాఖ్యానించిన బీజేపీ నేత దంగేర్, బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ తప్పారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యాధికారులు పేర్కొన్నారని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News