Petrol: ఈ రోజు మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- 35 పైసల వంతున పెరిగిన లీటర్ పెట్రోల్, డీజిల్
- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.83
- విదేశీ మారకద్రవ్య రేట్లను అనుసరించి మారుతున్న ధరలు
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓవైపు వంట గ్యాస్ ధరలను పెంచుతున్న పెట్రోలియం కంపెనీలు... మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచుతూ జనాల నడ్డి విరుస్తున్నాయి. ఈరోజు కూడా వీటి ధరలు అమాంతం పెరిగి, సరికొత్త రికార్డులను చేరుకున్నాయి.
ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. డీజీల్ ధర కూడా ఇదే మొత్తంలో పెరిగింది. పెరిగిన రేట్లతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ (ఇండియన్ ఆయిల్ సోర్స్) ధర రూ. 87.30, డీజిల్ ధర రూ. 77.48కి చేరుకుంది. ముంబైలో అత్యధికంగా పెట్రోల్ ధర రూ. 93.83, డీజిల్ ధర రూ. 84.36కి పెరిగింది. విదేశీ మారకద్రవ్య రేట్లను అనుసరించి ధరలు మారుతున్నట్టు పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు చెపుతున్నాయి. పెరిగిన ధరలను సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి తీసుకొస్తారు.