: ఐపిఎల్ ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ


చెన్నై చేతిలో చిత్తయ్యి ఫైనల్ చాన్స్ కోల్పోయింది ముంబై ఇండియన్స్. అయినా మరొక అవకాశం ఆ జట్టు చేతిలో ఉంది. నేడు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే చెన్నైపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముంబై ఇండియన్స్ కు ఫైనల్లో అవకాశం చిక్కుతుంది. కానీ, సన్ రైజర్స్ పై గెలిచిన ఉత్సాహంతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా సర్వశక్తులూ ఒడ్డి ఫైనల్ కు వెళ్లాలని తహతహలాడుతోంది. దీంతో ఫైనల్ కు ముందు పోరే హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. సెట్ మ్యాక్స్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.

  • Loading...

More Telugu News