Shiv Sena: మ‌హారాష్ట్ర బీజేపీ కార్య‌క‌ర్త‌పై ఇంకు పోస్తూ దాడి.. వీడియో ఇదిగో!

Shiv Sena workers allegedly pour black ink on a BJP leader and forced him to wear a saree

  • ఉద్ధవ్ థాక‌రేపై బీజేపీ కార్య‌క‌ర్త‌ విమర్శలు చేశాడని దాడి
  • మహారాష్ట్రలోని సోలాపూర్‌ ప్రాంతంలో ఘ‌ట‌న
  • శివ‌సేన నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ నేత‌ల డిమాండ్  

మ‌హారాష్ట్రలో ఓ బీజేపీ కార్యకర్తపై శివసేన పార్టీ నేతలు న‌డిరోడ్డుపై దాడి చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌పై ఇంకు పోయ‌డ‌మే కాకుండా, చీర క‌ట్టడానికి ప్ర‌య‌త్నించారు. ఓ పోలీసు వ‌చ్చి అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ బీజేపీ కార్య‌కర్త‌పై శివసేన‌ నేత‌ల దాడి ఆగ‌లేదు. ఆయ‌న‌పై దాడిని కొన‌సాగించారు. చివ‌ర‌కు ఆ బీజేపీ కార్య‌క‌ర్త వారి బారి నుంచి త‌ప్పించుకుని పారిపోయాడు.

మ‌హారాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక‌రేపై బీజేపీ కార్య‌క‌ర్త‌ విమర్శలు చేశాడనే కారణంతో ఈ దాడికి పాల్ప‌డ్డారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియా చేతికి చిక్కింది. దాడికి పాల్ప‌డ్డ‌ శివ‌సేన నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News