Kriti Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Kriti Shetty Shetty opposite Akhil Akkineni

  • అఖిల్ అక్కినేని సినిమాలో కృతి శెట్టి 
  • కోల్ కతా నేపథ్యంలో మెగాస్టార్ సినిమా 
  • కల్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు 
  • కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ

* 'ఉప్పెన' సినిమాలో కథానాయికగా నటించిన కృతి శెట్టి టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే నాని సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అఖిల్ అక్కినేని సరసన నటించే ఛాన్స్ కూడా పొందినట్టు తెలుస్తోంది. దీని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'వేదాళం' తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. కథను బట్టి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కోల్ కతాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట.
*  నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా 'రావణ్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. పునర్జన్మల కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా వుంటాయని అంటున్నారు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది.  
*  'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రంతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని నూతన దర్శకుడితో చేయనున్నాడు. అవినాశ్ కోకాటి అనే కుర్రాడు చెప్పిన కథ నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Kriti Shetty
Chiranjeevi
Kalyan Ram
Catherin
  • Loading...

More Telugu News