Pawan Kalyan: నాతో సినిమా చేయమని ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగాను: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines about producer AM Ratnam
  • ఏఎం రత్నంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • రత్నంతో తనకు ఎప్పటినుంచో పరిచయం ఉందని వెల్లడి
  • రత్నం మినహా మరే నిర్మాతను సినిమా అడగలేదని వివరణ
  • తనకు ఖుషీ వంటి హిట్ ను ఇచ్చారన్న పవన్
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకుడిగా పవన్ ప్రస్తుతం ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఏఎం రత్నంతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని వెల్లడించారు.

తనకు నెల్లూరులో ఓ స్నేహితుడు ఉన్నాడని, అతను ఏఎం రత్నంకు బంధువు అని తెలిపారు. ఆ విధంగా తన స్నేహితుడి ద్వారా రత్నం పరిచయం అయ్యారని, చెన్నైలో తరచుగా కలుస్తుండేవాడ్నని వివరించారు. అయితే, తనతో సినిమా చేయమని ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగానని, మరే నిర్మాతను ఆ విధంగా అడగలేదని పవన్ వెల్లడించారు. తన కెరీర్ లో చిరస్మరణీయ చిత్రం ఖుషీ ఏఎం రత్నం బ్యానర్ నుంచే వచ్చిందని చెప్పారు. మున్ముందు ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
AM Ratnam
Producer
Birthday
Tollywood

More Telugu News