Chandrababu: నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలమయ్యాడు... బడ్జెట్ పై చంద్రబాబు స్పందన

Chandrababu says Jagan Reddy failed to grab allocations in union budget

  • ప్రత్యేక హోదా ఊసే లేదన్న చంద్రబాబు
  • ఆర్థిక లోటు భర్తీ కూడా లేదని వెల్లడి
  • జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపణ
  • కేసుల మాఫీ కోసం ఎంపీలను వాడుకుంటున్నాడని విమర్శలు

కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై బీజేపీ మిత్ర పక్షాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ ప్రకటించిన వార్షిక బడ్జెట్ పై తన అభిప్రాయాలు తెలియజేశారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలమయ్యాడని అన్నారు.

ప్రత్యేక హోదా ఊసే లేదని, ఆర్థిక లోటు భర్తీ లేదని విమర్శించారు. 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవని, అమరావతి, పోలవరానికి కూడా నిధుల ప్రకటన లేదని అన్నారు. పునర్విభజన చట్టంలో అంశాలకు పరిష్కారం లేదని తెలిపారు. కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ద్రోహం చేశాడని విమర్శించారు. కేసుల మాఫీ కోసమే ఎంపీలను వాడుతున్నాడని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News