Justice Pushpa: వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు ఝలక్!

Supreme Court to take action against Justice Pushpa

  • లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న జస్టిస్ పుష్ప
  • ఆమె తీర్పులపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత
  • శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలనే సిఫారసులను వెనక్కి తీసుకున్న కొలీజియం

ఇటీవలి కాలంలో సంచలన తీర్పులను వెలువరిస్తూ బాంబే హైకోర్టు మహిళా జడ్జి జస్టిస్ పుష్ఫ గనేడివాలా పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. మహిళల ఎదపై చేయి వేయడం, మహిళల ముందు ప్యాంట్ జిప్ తీయడం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావంటూ ఆమె తీర్పులను వెలువరించారు. ఈ తీర్పులపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కల్పించుకుంది. ఆమెకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ లో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ బెంచ్ కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించేందుకు ఈ నెల 20న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే, ఆమె వెలువరించిన తాజా తీర్పుల నేపథ్యంలో, ఆ సిఫారసులను కొలీజియం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News