USA: హెచ్​4 వీసాదారులకు ఊరట.. ట్రంప్​ ఉత్తర్వులను రద్దు చేసిన బైడెన్​ ప్రభుత్వం

Biden admin withdraws move to rescind work authorisation for H1B spouses

  • లక్ష మంది హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలకు ఉద్యోగం చేసే అవకాశం
  • ఉద్యోగం చేయకుండా 2019లో ఉత్తర్వులిచ్చిన నాటి అధ్యక్షుడు ట్రంప్
  • తాజాగా ఆ ఉత్తర్వులను రద్దు చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ
  • మొత్తం హెచ్4 వీసాదారుల్లో 93 శాతం మంది భారతీయులే
  • 2015లో గ్రీన్ కార్డు వెయిటింగ్ లో ఉన్న వారి కోసం హెచ్4ను తీసుకొచ్చిన ఒబామా

వలస విధానాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలనే తీసుకున్నారన్న విమర్శలు ఉండేవి. విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై పరిమితి పెట్టడం, అమెరికా పౌరసత్వం ఇచ్చే గ్రీన్ కార్డులపై తిరకాసులు పెట్టడం వంటివి చేశారు.

అంతేకాదు.. హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చే హెచ్4 వీసాలపైనా 2019 ఫిబ్రవరిలో ఆయన ఆంక్షలు పెట్టారు. వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉత్తర్వులు పాస్ చేశారు.  

అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత ఆ ఉత్తర్వులు ఇప్పుడు రద్దయిపోయాయి. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ట్రంప్ పాస్ చేసిన ఆ ఆదేశాలను నిలిపేశారు. హెచ్4 డిపెండెంట్ స్పౌజెస్ ను ఉద్యోగార్హుల జాబితా నుంచి తీసేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బిజినెస్ (ఓఎంబీ) పరిశీలించింది.

బైడెన్ వచ్చాక వాటన్నింటినీ 60 రోజుల వరకు ఆపేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది హెచ్4 వీసాదారులకు లబ్ధి చేకూరనుంది.

ఏంటీ హెచ్4 వీసా?

కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలకు హెచ్4 వీసాను ఇస్తారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుని ఉండి, అది కన్ఫర్మ్ అవుతుందనుకున్న హెచ్1బీ వీసాదారులు లేదా ఆరేళ్లు లేదా ఆపైన హెచ్1బీ వర్క్ వీసా పొడిగింపు పొందిన వారి భార్యలు/భర్తలకే హెచ్4 వీసాను ఇస్తారు. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి కోసం 2015లో నాటి బరాక్ ఒబామా ప్రభుత్వం.. ఈ హెచ్4 ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)ని తీసుకొచ్చింది.

2017 డిసెంబర్ నాటికి 84,360 మంది భారతీయులు ఈఏడీ ప్రోగ్రామ్ కింద అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అందులో సింహభాగం భార్యలే ఉన్నారు. అప్పుడు అమెరికా ఆమోదించిన హెచ్4 వీసాల్లో 93 శాతం భారతీయులవే అంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇప్పటికి వారి సంఖ్య లక్ష దాటి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News