Vehicles: 15 ఏళ్లు దాటిన వాహనాలపై కొరడా.. కేంద్రం కీలక నిర్ణయం

Govt ready to impose green tax on 15 year old vehicles

  • కాలుష్య నివారణకు కేంద్రం సరికొత్త ప్రతిపాదన
  • సంతకం చేసిన మంత్రి నితిన్ గడ్కరీ
  • గ్రీన్‌ట్యాక్స్ సొమ్ము పర్యావరణ పరిరక్షణకు ఖర్చు

దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ చెప్పే ప్రయత్నాలు ప్రారంభించిన కేంద్రం 15 ఏళ్లు దాటిన వాహనాలపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేశారు. ఈ ప్రతిపాదన ప్రకారం 8 ఏళ్లు దాటిన రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ సమయంలో 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తారు. 15 ఏళ్లు అంతకంటే పాత వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్‌ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి.

అదే సమయంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఇథనాల్, ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగిన వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. 15 ఏళ్లు, అంతకుమించి పాతవైన ప్రభుత్వ వాహనాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించకూడదన్న ప్రతిపాదన కూడా ఉంది. గ్రీన్‌ట్యాక్స్ ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తారు.

  • Loading...

More Telugu News