: ఇది స్వైన్‌ప్లూ వ్యాక్సిన్‌ కూడా...!


మన పిల్లలకు వివిధ రకాలైన వ్యాక్సిన్లను వేయిస్తుంటాం. పలు రకాలైన విష జ్వరాలు రాకుండా ఉండేందుకు మన చిన్నారులకు వ్యాక్సినేషన్‌ చేయిస్తుంటాం. అయితే కొత్తగా వస్తున్న జ్వరాలకు వ్యాక్సిన్లను కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో మనల్ని వణికిస్తున్న జ్వరం స్వైన్‌ఫ్లూ. ఈ వ్యాధికి కూడా పనిచేసే ఒక సరికొత్త వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు.

పిల్లలో పలురకాలైన జ్వరాలను ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తిని వృద్ధి చేసే విధంగా ఒక సరికొత్త వ్యాక్సిన్‌ను అలర్జీ, అంటువ్యాధుల జాతీయ పరిశోధక సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ వివిధ కాలాల్లో పిల్లలపై దాడి చేసే జ్వరాలను రాకుండా చేయడమే కాదు కొత్తగా వస్తోన్న స్వైన్‌ ఫ్లూకు కారణమయ్యే హెచ్‌1ఎన్‌1 వైరస్‌నూ ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం జ్వరాలను రాకుండా నియంత్రించేందుకు ఉపయోగిస్తున్న వివిధ రకాలైన ఔషధాలకంటే ఈ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలను ఇస్తుందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News