Somu Veerraju: జగన్ ప్రభుత్వం హిందువులను చులకనగా చూస్తే బీజేపీ సహించదు: సోము వీర్రాజు

Somu Veerraju says BJP wont tolerate discrimination of Hindus in AP

  • హిందువులు అందరినీ గౌరవిస్తారని వెల్లడి
  • హిందువులు మతతత్వవాదులు కారని స్పష్టీకరణ
  • రథయాత్రలో ప్రజలకు వివరిస్తామన్న సోము వీర్రాజు
  • ఫిబ్రవరి 4 నుంచి ఏపీలో బీజేపీ రథయాత్ర

ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హిందువులను చులకనగా చూస్తే బీజేపీ సహించదని సోము వీర్రాజు హెచ్చరించారు. సమాజంలో ఉండే అందరినీ హిందువులు గౌరవిస్తారని, హిందువులు మతతత్వ వాదులు కారని స్పష్టం చేశారు. బీజేపీపై దాడి చేస్తే హిందువులపై దాడి చేసినట్టేనని అన్నారు. ఈ అంశంపై తాము ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, హిందువులను మతతత్వ వాదులుగా చిత్రీకరించడం పట్ల రథయాత్రలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

ఏపీలో గతకొంతకాలంగా జరుగుతున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటలనపై బీజేపీ ఫిబ్రవరి 4 నుంచి రథయాత్ర చేపడుతోంది. వారం రోజుల పాటు సాగే ఈ యాత్ర తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు నిర్వహిస్తారు. ఈ యాత్రకు జనసేన కూడా మద్దతిస్తోంది. నెల్లూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడ, అంతర్వేది, పిఠాపురం వంటి ప్రాంతాల మీదుగా ఈ రథయాత్ర రామతీర్థం చేకుంటుంది.

  • Loading...

More Telugu News