: దేశంలో చీలికలు తెచ్చేందుకే టెర్రర్ దాడి: బ్రిటన్ ప్రధాని
వివిధ జాతులకు చెందిన ప్రజలు బ్రిటన్ లో ఐకమత్యంగా ఉన్నారని, అలాంటి దేశంలో చీలికలు తెచ్చే ఉద్ధేశంతోనే ఈరోజు సైనికుడి హత్య చోటు చేసుకుందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ వ్యాఖ్యానించారు. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దంటూ దేశవాసులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉదయం ఇద్దరు వ్యక్తులు ఊల్ విచ్ సైనిక కేంద్రం వద్ద ఓ సైనికుడిపై దాడి చేసి మొండెం నుంచి అతని తలను వేరుచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై కామెరూన్ స్పందించారు. తన ప్యారిస్ పర్యటన రద్దు చేసుకున్న ఆయన ప్రభుత్వ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.