: ఎర్రబెల్లిపై కడియం తీవ్ర ఆరోపణలు
ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత కడియం శ్రీహరి తన మాజీ సహచరులపై మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇద్దరూ తనపై అనుచిత వ్యాఖ్యలు మానుకోకుంటే వారి రహస్యాల చిట్టా బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసలు, తనకంటే ముందే వారిద్దరూ టీఆర్ఎస్ లో చేరేందుకు సంప్రదింపులు జరిపారని కడియం బాంబు పేల్చారు. హైదరాబాద్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు.