India: రెండో టెస్టులో పట్టు సాధించిన ఆస్ట్రేలియా!

Australia Going Strond in Third Test

  • తొలిరోజు ఆసీస్ ఆధిపత్యం
  • నేడు రెండు వికెట్లు తీసిన జడేజా
  • 91 పరుగుల వద్ద లబుస్ చేంజ్ అవుట్

సిడ్నీలో ఇండియాతో జరుగుతున్న మూడవ టెస్ట్ లో తొలిరోజు ఆధిపత్యాన్ని చూపించిన ఆస్ట్రేలియా, రెండో రోజున కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఈ ఉదయం (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) వర్షం కారణంగా కాస్తంత ఆలస్యంగా ఆట ప్రారంభం కాగా, లబుస్ చేంజ్, మ్యాథ్యూ వేడ్ వికెట్ ను మాత్రమే భారత్ తీసింది. 91 పరుగులు చేసి, సెంచరీ దిశగా సాగుతున్న లబుస్ చేంజ్, జడేజా బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టగా అవుట్ అయ్యాడు. మొత్తం 196 బంతులాడిన లబుస్ చేంజ్ 11 ఫోర్లు సాధించాడు.

ఆపై క్రీజ్ లోకి వచ్చిన మ్యాథ్యూ వేడ్, అప్పటికే క్రీజులో నిలదొక్కుకుని ఉన్న స్టీవెన్ స్మిత్ తో కలిసి స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేయగా, అతని వికెట్ ను జడేజానే తీశాడు. జడేజా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన వేడ్, బుమ్రాకు క్యాచ్ ఇచ్చి, 13 పరుగుల వద్ద పెవీలియన్ కు చేరాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 77 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 232 పరుగులు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ ఆటగాళ్ల వికెట్లను తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News