Visakhapatnam District: విశాఖపట్టణం ఫార్మా సిటీలో మరో అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి మూడు పేలుళ్లు

Fire accident in visakha parawada pharma city

  • పరవాడలోని జేపీఆర్ ల్యాబ్స్‌లో ప్రమాదం
  • ఎగసిపడిన మంటలు, దట్టంగా కమ్మేసిన పొగ
  • మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి జేపీఆర్ ల్యాబ్స్‌లో గత అర్ధరాత్రి మూడు పేలుళ్లు సంభవించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. పొగలు దట్టంగా కమ్మేశాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Visakhapatnam District
parawada pharma city
Fire Accident
  • Loading...

More Telugu News