GVL Narasimha Rao: విజయసాయిరెడ్డి, చంద్రబాబుకు అనుమతి ఇచ్చారు.. మాకెందుకు ఇవ్వరు?: జీవీఎల్
- రామతీర్థంకు బీజేపీ-జనసేన శాంతియుత యాత్ర
- అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పద్ధతులు
- ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము
విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన-బీజేపీ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన ధర్మయాత్ర ఆందోళన నేపథ్యంలో రామతీర్థం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రామతీర్థానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేశారు. దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.
'రామతీర్థంకు బీజేపీ-జనసేన శాంతియుత యాత్రను అడ్డుకునే వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నాము. విజయసాయి(వైసీపీ), చంద్రబాబు(టీడీపీ)లను పోలీసు రక్షణతో సందర్శించడానికి అనుమతించగా, మా అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని నిరోధించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?' అని జీవీఎల్ నరసింహారావు నిలదీశారు.