Farmers: 'మీ భోజనం మీది, మా భోజనం మాది'... కేంద్ర మంత్రులతో కలసి తినేందుకు రైతు ప్రతినిధుల నిరాకరణ!

Farmers Refuse Lunch Offered by Central Ministers

  • రైతు ప్రతినిధులకు భోజనం ఆఫర్ చేసిన కేంద్ర మంత్రులు
  • తాము తెచ్చుకున్న భోజనాన్ని కింద కూర్చుని తిన్న రైతు ప్రతినిధులు 
  • శుక్రవారం మరో విడత జరగనున్న చర్చలు

నిన్న రైతులతో 7వ విడత చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయుష్ గోయల్, సోమ్ ప్రకాశ్ లు ఆఫర్ చేసిన భోజనాన్ని రైతు ప్రతినిధులు తిరస్కరించారు. "మీ భోజనం మీరు తినండి, మా భోజనాన్ని మేము తింటాం" అని వారు స్పష్టం చేయడం గమనార్హం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ చర్చలు జరుగగా, రైతు ప్రతినిధులు తాము తెచ్చుకున్న భోజనాన్ని ఓ టేబుల్ పై పెట్టుని ఆరగించారు. కొందరు నేలపై కూర్చుని తమ భోజనాన్ని ఆరగించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.

కాగా, ఈ చర్చలు కూడా రైతుల నిరసనలకు శుభం పలికేలా ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగియగా, శుక్రవారం నాడు మరో విడత సమావేశం కావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక తమతో చర్చించిన కేంద్ర మంత్రులను, తాము నిరసనలు తెలుపుతున్న ప్రాంతానికి వచ్చి, తామిచ్చే విందును ఆరగించాలని రైతులు కోరడం గమనార్హం. ఇటీవల తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, దిగుబడికి కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినా ఇప్పటికీ ప్రతిష్ఠంభన వీడలేదు.

  • Loading...

More Telugu News