Tollywood: ముంబయిలో డ్రగ్స్ పట్టివేత... టాలీవుడ్ నటి అరెస్ట్

NCB arrests Tollywood actress in drugs case

  • మిరా రోడ్డులోని హోటల్ పై దాడి
  • చాంద్ అనే డ్రగ్స్ విక్రేత, నటి అరెస్ట్
  • పారిపోయిన డ్రగ్స్ సరఫరాదారు
  • నటి ఎవరన్నది వెల్లడించని వైనం

ముంబయిలో ఇవాళ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ డ్రగ్స్ విక్రేత నుంచి రూ.10 లక్షల విలువ చేసే మెఫెడ్రోన్ అనే మత్తుపదార్థాన్ని  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ టాలీవుడ్ నటిని కూడా అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.

ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్ పై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు దాడులు చేశారు. అక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న చాంద్ మహ్మద్ అనే వ్యక్తితో పాటు టాలీవుడ్ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే సయ్యద్ అనే వ్యక్తి పారిపోయినట్టు గుర్తించారు. కాగా, అరెస్టయిన టాలీవుడ్ నటి పేరును అధికారులు వెల్లడించలేదు.

కొంతకాలం కిందట సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ వ్యవహారమే కీలకంగా మారింది. ఈ కేసులో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురిని ప్రశ్నించడం తెలిసిందే.

Tollywood
Actress
Drugs
Mumbai
NCB
  • Loading...

More Telugu News