BJP: రైతు ఉద్యమంపై దుష్ప్రచారం ఆరోపణలు.. రామ్‌మాధవ్ సహా ముగ్గురికి నోటీసులు!

Farmers sent notices to three bjp leaders

  • కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, నితిన్ పటేల్‌కు కూడా
  • చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • రైతులకు న్యాయ సాయం అందిస్తామన్న ‘ఆప్’

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఉద్యమాన్ని అవమానిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారంటూ ముగ్గురు బీజేపీ నేతలకు రైతులు లీగల్ నోటీసులు పంపించారు. తమ పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, రామ్ మాధవ్‌లకు  అమృత్‌సర్‌లకు చెందిన జస్‌కరణ్ సింగ్, జలంధర్‌కు చెందిన రామ్‌కీ సింగ్, రణధావా, సంగ్రూర్‌కు చెందిన సుఖ్వీందర్ సింగ్‌లు నోటీసులు పంపారు. కాగా, నోటీసులు పంపిన రైతులకు అవసరమైన న్యాయ సహాయం అందించనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News