New Virus: కొత్త కరోనా వైరస్ అనుపానులు కనుగొన్న ఇండియా!
- వైరస్ ను జయించే దిశగా అడుగులు
- ఎన్ఐవీలో వైరస్ విషయం తేల్చిన శాస్త్రవేత్తలు
- విరుగుడు కనుక్కునే ప్రయత్నాలు
యూకే నుంచి ఇండియాకు ప్రవేశించిన కొత్త కరోనా వైరస్ పైనా విజయం సాధించే దిశగా ఇండియా ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఐసీఎంఆర్ యూకే నుంచి వచ్చిన సార్స్ - కోవ్-2 వేరియంట్ నమూనాలను సేకరించి, ఆ వైరస్ జాడలు, జన్యు క్రమాన్ని కనుగొన్నామని తెలిపింది.
ఈ వైరస్ ను ఎన్ఐవీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)లో పెంచుతున్నామని, తద్వారా వైరస్ కు విరుగుడు కనుక్కోవచ్చని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కొత్త వైరస్ భవిష్యత్తులో ఇంకెలా మారుతుందన్న వివరాలనూ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని తెలిపారు.