Nara Lokesh: చేసిందే చ‌ట్టం, ఇచ్చేదే జీవోగా వైఎస్ జగన్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది: లోకేశ్

lokesh slams jagan

  • జీఓ నంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు
  • జీవో 142 తెచ్చి పాత్రికేయుల‌కు ఉన్న ఒకే ఒక సౌక‌ర్యం అక్రిడిటేష‌న్ పీకేశారు
  • కమిటీలో జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిస్టు సంఘాల‌కు చోటు లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'చేసిందే చ‌ట్టం, ఇచ్చేదే జీవోగా వైఎస్ జగన్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది. జీఓ నంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయుల‌కు ఉన్న ఒకే ఒక సౌక‌ర్యం అక్రిడిటేష‌న్ పీకేశారు' అని లోకేశ్ విమర్శించారు.

'అక్రిడిటేష‌న్‌ కమిటీలో జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిస్టు సంఘాల‌కు చోటు లేక‌పోవ‌డం వింత‌ల్లోకెల్లా వింత‌. టీడీపీ హ‌యాంలో ఇచ్చిన అక్రిడిటేష‌న్ల‌లో 10 శాతం కూడా ఇవ్వ‌డంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని త‌న మీడియా వారికే అక్రిడిటేష‌న్లు ఇచ్చి మిగిలిన జ‌ర్న‌లిస్టులంద‌రికీ మొండిచేయి చూప‌డం చాలా దారుణం. అక్రిడిటేష‌న్ జ‌ర్న‌లిస్టుల హ‌క్కు. ప‌నిచేసే జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్ ఇవ్వాల‌ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది' అని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News