Nagma: రజనీకాంత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాను: నగ్మా

I applaud Rajinikanths decision says Nagma

  • ఆరోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనన్న రజనీకాంత్
  • ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమైనదన్న నగ్నా
  • రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్ష

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను సూపర్ స్టార్ రజనీకాంత్ విరమించుకున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం సహకరించడం లేదని... రాజకీయాల కోసం ఇప్పుడు రోడ్లపైకి వస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.

రజనీ చేసిన ప్రకటనపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్పందించారు. రజనీకాంత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశంసిస్తున్నానని ఆమె అన్నారు. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యమైనదని అన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజల మేలు కోసం రజనీ పాటుపడాలని ఆకాంక్షించారు.

Nagma
Rajinikanth
tollywood
Kollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News