AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మాతృవియోగం

AR Rahman mother Kareema Begum passed away

  • ఏఆర్ రెహమాన్ కుటుంబంలో విషాదం
  • రెహమాన్ తల్లి కరీమాబేగం కన్నుమూత
  • ఇంకా వెల్లడికాని కారణాలు
  • తల్లి మరణాన్ని నిర్ధారించిన రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రెహమాన్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కరీమాబేగం కన్నుమూశారు. ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రెహమాన్ ఆమె మృతిని నిర్ధారించారు. కరీమాబేగం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది.

రెహమాన్ తండ్రి, దక్షిణాది సంగీత దర్శకుడు ఆర్కే శేఖర్ చాలాకాలం కిందటే ఈ లోకాన్ని విడిచారు. అనంతరం తల్లి కరీమాబేగం (కస్తూరి శేఖర్)తో కలిసి రెహమాన్ (దిలీప్) ఇస్లాం మతం స్వీకరించి పేర్లు కూడా మార్చుకున్నారు. తల్లితో రెహమాన్ కు అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన అనేక పర్యాయాలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాను కెరీర్ లో ఎదిగే క్రమంలో ప్రతి కీలక ఘట్టంలో తల్లి నిర్ణయాలు, మద్దతు ఉన్నాయని వెల్లడించారు.

AR Rahman
Kareema Begum
Demise
Illness
  • Loading...

More Telugu News