USA: భారత్‌లో రైతుల ఉద్యమంపై తమ విదేశాంగ మంత్రికి అమెరికా చట్టసభ సభ్యుల లేఖ

usa law makers writes letter to pompeo

  • భారత విదేశాంగశాఖతో చర్చించాలి
  • ఆ రైతులతో అమెరికాలోని భారత సంతతి వారికి సంబంధాలున్నాయి 
  • రైతుల ఉద్యమంతో భారత్ ‌పై ప్రభావం  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో రైతులు కొన్ని రోజులుగా పట్టు విడవకుండా నిరసనలు తెలుపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై విదేశాలు సైతం స్పందిస్తుండడం గమనార్హం. అమెరికా చట్టసభల్లోని ముఖ్యమైన సభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత విదేశాంగశాఖతో చర్చించాలని కోరుతూ తమ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు లేఖ రాశారు.

ఆయనకు లేఖ రాసిన వారిలో భారత సంతతి సభ్యురాలు‌ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో అమెరికాలోని చాలా మంది భారత సంతతి వ్యక్తులకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని లేఖలో చట్టసభ సభ్యులు పేర్కొన్నారు. రైతుల ఉద్యమంతో భారత్ ‌పై ప్రభావం పడనుందని అన్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో నివసిస్తోన్న భారతీయులందరినీ ఇది ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. భారత చట్టాలను తాము గౌరవిస్తామని, అయితే, భారత రైతులకు ఆర్థిక భద్రతపై పలు అనుమానాలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రైతుల ఆందోళన విషయంలో కొన్ని దేశాలు ఇప్పటికే స్పందించడంతో.. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సంబంధిత దేశాలకు కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. 

  • Loading...

More Telugu News