Chandrababu: ఆడపిల్లలకు మేనమామలా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంసుడిలా మారాడు: చంద్రబాబు

Chandrababu comments on Snehalatha murder issue
  • అనంతపురం జిల్లాలో స్నేహలత అనే యువతి హత్య
  • ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు
  • ఎన్నడూలేనంతగా హత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపణ   
  • దిశ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తే స్పందనలేదని విమర్శ 
అనంతపురం జిల్లాలో స్నేహలత అనే చిరుద్యోగిని దారుణ హత్యకు గురైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని విమర్శించారు. ఆడపిల్లలకు మేనమామలా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంసుడిలా మారాడని వ్యాఖ్యానించారు. చట్టమే రాని దిశ పేరిట పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, వాహనాలు పంపిణీ చేశారని, కానీ దిశ పోలీస్ స్టేషన్ కు బాధితురాలి తల్లి ఫోన్ చేస్తే స్పందనే లేదని వెల్లడించారు. ఎప్పుడూ లేనివిధంగా ఆడబిడ్డలపై హత్యాచారాలు, వేధింపులు జరిగాయని ఆరోపించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వరుసగా మూడు ఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు.
Chandrababu
Snehalatha
Murder
Anantapur District
Disha Act
Jagan
Andhra Pradesh

More Telugu News